: లాస్ ఏంజిల్స్ లో స్కూలుకు వెళుతున్న సన్నీ లియాన్!


ఇటీవలి కాలంలో కాసింత సినిమా చాన్స్ లు తగ్గాయేమో, చిరకాలంగా మిగిలిపోయిన తన కోరికను తీర్చుకునేందుకు బయలుదేరింది శృంగార తార సన్నీ లియాన్. రచయితగా, ఎడిటర్ గా తనలో ప్రతిభను మెరుగుపరచుకోవాలని భావిస్తున్న ఆమె, లాస్ ఏంజిల్స్ లోని ఓ విద్యాసంస్థలో చేరింది. స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ కోర్సుల్లో చేరింది. తన భర్తతో కలసి కొంతకాలం అక్కడే ఉండి కోర్సును పూర్తి చేయాలని ఆమె భావిస్తోంది. కొంతకాలంగా సన్నీ డైరీ ఖాళీగా ఉండటంతోనే చిక్కిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలని సన్నీ ప్రయత్నాలు ప్రారంభించిందన్న మాట. అన్నట్టు లాస్ ఏంజిల్స్ కు బయలుదేరే ముందు దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆడి పాడిందీ అమ్మడు.

  • Loading...

More Telugu News