: ఆ సినిమాను యూకేలో ఒక్క ప్రేక్షకుడు మాత్రమే చూశాడు!


ఓపక్క యుద్ధం... ఆ తర్వాత తమ నుంచి విడిపోయిన కొడుకు కోసం ఓ సైనికుడి ప్రయత్నం.. ఈ నేపథ్యంలో చిత్రీక‌రించిన ‘మాన్‌ డౌన్‌’ అనే సినిమా యూనిట్‌కి యూకేలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సినిమాలో అమెరికా నటీనటులు షియా లాబోఫ్‌, కేట్‌ మారా నటించారు. యూకేలో ఈ సినిమా ఎంతటి ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుందంటే విడుద‌లై వారం రోజులు అవుతున్నా ఈ చిత్రాన్ని ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ప్రేక్షకుడు మాత్ర‌మే చూశాడ‌ట‌. కేవలం ఒకే ఒక్క టికెట్‌ అమ్ముడైన ఈ సినిమా అంత‌ర్జాతీయంగా వార్త‌ల్లో నిలిచింది. సాధారణంగా యూకేలో సగటు సినిమా టికెట్‌ ధర 7.21 యూరోలు ఉంటే.. ఈ సినిమాకు మాత్రం 7యూరోలు వెచ్చించి ఒకే ప్రేక్ష‌కుడు కొన్నాడ‌ట‌. తొలి వారాంతంలో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ కలెక్షన్‌ కేవలం 7యూరోలుగా ఉంది.

యూకే కంటే ముందు ఈ చిత్రాన్ని అమెరికాలో ముందుగా విడుదల చేశారు. అక్క‌డ మాత్రం ఈ సినిమాకు 4.54 లక్షల డాలర్ల కలెక్షన్లు వ‌చ్చాయి. యూకేలో ఇలా ఓ సినిమాకు ఒకే ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఓ చిత్రానికి కూడా ఇలాగే జరిగింది.

  • Loading...

More Telugu News