: ఆ ముగ్గురూ రాజ్యాంగ విలువలను మంటగలిపారు: ధర్మాన ప్రసాదరావు
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రాదరావులు ముగ్గురూ రాజ్యాంగ విలువలను మంటగలిపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. మన దేశంలో గత 70 ఏళ్లుగా ఉన్న రాజ్యాంగ బద్ధమైన సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని... దీనికి గవర్నర్ నరసింహన్ దగ్గరుండి ఆమోద ముద్రలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీలో రాజ్యాంగం అమల్లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదుల పట్ల స్పీకర్ కోడెల నుంచి కనీస స్పందన కూడా లేకపోయిందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ దీనిపై స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.