: జైలులో వైగో మౌనవ్రతం.. మంచినీళ్లు కూడా ముట్టని వైనం!
దేశద్రోహం కేసులో అరెస్టై పుళల్ సెంట్రల్ జైలులో ఉన్న ఎండీఎంకే నేత వైగో బుధవారం జైలులో మౌనవ్రతం పాటించారు. ఎగ్మూరు బహిరంగ సభలో ఎల్టీటీఈకి మద్దతుగా ప్రసంగించినందుకు ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఇటీవల ఆయన కోర్టులో లొంగిపోయారు. బెయిలుకు అవకాశం ఉన్నా తీసుకోకుండా జైలుకు వెళ్లేందుకే సిద్ధపడ్డారు. దీంతో మేజిస్ట్రేట్ ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించారు. మంగళవారం పొంగల్, వడను అల్పాహారంగా తీసుకున్న వైగో తన తండ్రి వయ్యాపురియార్ వర్ధంతి సందర్భంగా బుధవారం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మౌనవత్రం పాటించారు.