: ఐపీఎల్-10 ప్రారంభ వేడుకలు.. అదరగొట్టిన అమీ జాక్సన్.. క్రికెట్ దిగ్గజాలకు సన్మానం!
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ - 10వ సీజన్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లను స్టేడియంలోకి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మైదానంలో తిరుగుతూ, అభిమానులను వారు ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లను బీసీసీఐ సత్కరించి జ్ఞాపికలు అందజేసింది. అనంతరం, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ఓపెన్ టాప్ వాహనంలో స్టేడియంలోకి అడుగుపెట్టింది. కాలాచష్మా, దమ్మాదమ్మా పాటలకు తన బృందంతో డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించింది.