: ఐపీఎల్ -10.. ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు!
హైదరాబాద్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 10వ సీజన్ సందడి మొదలైంది. ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 6.20 గంటలకు స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్, ప్రముఖ నటి అమీజాక్సన్ ఆటాపాటా వుంటాయి. మూడు వందల మంది సభ్యులు ఉన్న తన టీమ్ తో కలిసి అమీజాక్సన్ ప్రదర్శన ఇవ్వనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభ మ్యాచ్ హైదరాబాద్, బెంగళూరు మధ్య జరగనుంది. కాగా, గత తొమ్మిది సీజన్లలో లీగ్ మ్యాచ్ లకే పరిమితమైన హైదరాబాద్ లో తొలిసారిగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్ కూడా జరుగుతుండటం విశేషం.