: శ్రీరాముడు, వైఎస్... తరువాత జగనే!: రోజా
సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తరువాత, అటువంటి పాలననే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళ ప్రజలు చూశారని, ఆ తరువాత జగన్ రాకతోనే రామరాజ్యం వస్తుందని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చిన ఆమె, స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఏపీలో రాముడి పాలన తిరిగి మొదలవుతుందని అన్నారు.
ఒంటిమిట్టను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇక్కడ భక్తులకు కనీసం మంచినీటిని కూడా అందించడం లేదని మండిపడ్డారు. కాగా, నేడు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కాగా, వేలాది మంది భక్తులు దర్శనానికి పోటెత్తారు. ఇక్కడి ఆనవాయితీ ప్రకారం, నిండు పున్నమి వెలుగుల్లో, 10వ తేదీన రాత్రిపూట శ్రీరామ కల్యాణం వైభవంగా జరగనుంది.