: తెలుగుదేశానికి 'జై' కొట్టిన టీఆర్ఎస్ ఎంపీ... పాత వాసనలు పోలేదన్న కవిత!


తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి, ఆపై టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి ఇంకా పాత పార్టీని మరచినట్టు లేదు. హైదరాబాదు మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం జరుగగా, మల్లారెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులను తీర్చిదిద్దడమే తన విద్యాసంస్థల లక్ష్యమని చెప్పారు. తాను ఎందరికో సేవ చేస్తున్నానని అన్నారు.

అయితే, ప్రసంగాన్ని ముగించే వేళ పాత అలవాటు ప్రకారం 'జై తెలుగుదేశం' అనగానే సభా ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. ఆపై మాట్లాడిన కవిత, మల్లారెడ్డిలో పాత వాసనలింకా పోయినట్టు లేదని చమత్కరించారు. అమ్మాయిలు కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాలని, అటువంటి వారికి తమ ప్రభుత్వం నిత్యమూ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News