: యూపీలో బీజేపీ నేత హత్య... ముజఫర్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ ఉదయం బీజేపీ నేత హత్యకు గురికావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడి బీజేపీ నేత రాజా వాల్మీకి రహదారిపై వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పై వచ్చి, తుపాకితో కాల్చిచంపారు. ఈ ఘటనలో బులెట్లు తలలోకి దూసుకెళ్లడంతో వాల్మీకి అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరి కేసు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నిరసనలకు దిగారు. దీంతో పట్టణంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా చూస్తున్నారు.