: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి!: ముస్లిం మత గురువు సూచన


గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ లోని ఆజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ సూచించారు. హిందువులు గోవును తల్లిగా పూజిస్తారని, అందుకే  గోమాంస భక్షణ ఆపేయాలని ఆయన ముస్లింలకు సలహా ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరైన అజ్మీర్ ఉర్సు (ఖాజా మొయినుద్దీన్ చిస్తీ వర్దంతి) ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, బీఫ్ తినడాన్ని ఆపేయాలని సూచించారు. 

అలాగే ట్రిపుల్ తలాక్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా మహిళల గౌరవాన్ని తగ్గించినవారమవుతున్నామని, ట్రిపుల్ తలాక్ కు ఖురాన్ ను అడ్డంపెట్టుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ విధానంపై మత పెద్దలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందువుతో సామరస్యం కోరుకుంటున్నప్పుడు వారు పూజించే గోమాంసం తినడంలో అర్థం లేదని, ఇకపై తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ బీఫ్ తినమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ముస్లిం వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. 

  • Loading...

More Telugu News