: మంత్రి పదవి నుంచి తొలగించినా పార్టీ మారను: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి


ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కొందరు ఎమ్మెల్యేలు అలకపాన్పు ఎక్కగా, చింతమనేని ఏకంగా అవసరమైతే కొత్తపార్టీ పెడతానని ప్రకటించారు. జలీల్ ఖాన్ తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 శాతం మంది ముస్లింలు ఆవేదన చెందుతున్నారని ప్రకటించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్న తరుణంలో మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విభిన్నంగా స్పందించారు. మంత్రి పదవి నుంచి తొలగించినా పార్టీని మారే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. శ్రీకాళహస్తిలో సమావేశమైన సందర్భంగా, పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, పార్టీ పటిష్ఠతకు పని చేద్దామని పిలుపునిచ్చారు. అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పదవి నుంచి తొలగించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News