: ఐపీఎల్ లో రాణించాలంటే... ఫిట్ నెస్ తో పాటు నిలకడ కీలకం: నెహ్రా


ఐపీఎల్ లో రాణించాంటే ఫిట్ నెస్ తో పాటు నిలకడగా మంచి ప్రదర్శన చేయడం అవసరమని టీమిండియా సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాదులో నెహ్రా మాట్లాడుతూ, ఫిట్ నెస్ చాలా ముఖ్యమైనది కావడంతో కొన్నేళ్లుగా ఫిట్ నెస్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. ఐదారేళ్లుగా ఫిట్ నెస్ సాధన తన కెరీర్ లో భాగమైందని నెహ్రా చెప్పాడు.

రోజూ ఐదారు గంటలు ఫిట్ నెస్ సాధన చేస్తానని, తరువాత బౌలింగ్ సాధన చేస్తానని నెహ్రా తెలిపాడు. పేస్ తనకు సహజంగా అబ్బిందని అన్నాడు. తన బలమే పేస్ అని, దానిని అనుకూలంగా మార్చుకుంటూ బౌలింగ్ చేస్తానని చెప్పాడు. వేగంగా బౌలింగ్ చేయడం అంత సులువైన విషయం కాదని చెప్పిన నెహ్రా, పూర్తి ఫిట్ నెస్ తో ఉంటేనే వేగంగా బౌలింగ్ చేయగలమని తెలిపాడు. ఈ సీజన్ లో టాప్ 4 బౌలర్లలో ఒకడిగా నిలవాలని అనుకుంటున్నానని నెహ్రా తెలిపాడు. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో వేగంగా బౌలింగ్ చేయడాన్ని తాను బాగా ఇష్టపడతానని నెహ్రా తెలిపాడు. 

  • Loading...

More Telugu News