: వేధింపుల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్టు!
ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఫేస్ బుక్, వాట్సాప్, ఈ మెయిల్స్ ద్వారా అసభ్య సందేశాలు, ఫొటోలు పోస్టు చేస్తూ వేధింపులకు దిగుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ప్రకాశం జిల్లాకు చెందిన నూతక్కి సురేష్ హైదరాబాదులోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సంస్థలో పని చేస్తున్న మరోసాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ప్రేమ, పెళ్లి వలను విసిరాడు.
అయితే ఆమె అతని ప్రపోజల్ ను తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న సురేష్... ఆమె ఫోటోలు సేకరించాడు. తప్పుడు ధ్రువపత్రాలతో వివిధ కంపెనీలకు చెందిన సిమ్ కార్డులు సంపాదించి, ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి, భాధితురాలితో పాటు ఆమె స్నేహితుడికి ఫేస్ బుక్, వాట్స్ యాప్, ఈ మెయిల్స్ ద్వారా పంపాడు. దీంతో ఆమె సైబర్ క్రైం విభాగాన్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు. సురేష్ బండారం బయటపెట్టారు. అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.