: ఈవీఎంల వివాదం నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే ఫీజు వివాదం!: కేజ్రీవాల్


ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీకి చెల్లించాల్సిన కేసు ఫీజు విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశారు. డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) నిధుల దుర్వినియోగంపై కీర్తీ ఆజాద్ చేసిన ఆరోపణలను సమర్థిస్తూ కేజ్రీవాల్ పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పెను వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని వాదించేందుకు కేజ్రీవాల్ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీని నియమించుకున్నారు.

ఈ కేసులో 11 సార్లు కోర్టుకు హాజరై వాదించినందుకు గానూ జెఠ్మలానీ 3.42 కోట్ల రూపాయల ఫీజు బిల్లును కేజ్రీవాల్ కు పంపారు. దీనిని చెల్లించాలంటూ ఢిల్లీ సర్కారు లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు బిల్లు పంపింది. ఇది పెను వివాదానికి కారణమైంది. కేజ్రీవాల్ వ్యక్తిగత కేసుకు ప్రజా ధనమా? అంటూ బీజేపీ మండిపడింది. దీంతో ఈ వివాదంపై స్పందించిన కేజ్రీవాల్, ఇదేమీ తన వ్యక్తిగత కేసు కాదని అన్నారు. ప్రజాధనానికి సంబంధించిన కేసు కనుక జెఠ్మలానీకి చెల్లించాల్సిన ఫీజు తాను చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల వివాదం నుంచి బీజేపీ అందరి దృష్టిని మరల్చేందుకు దీనిని వివాదం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. అవినీతిపై తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని బలహీనపరిచేందుకే దీనికి కొత్త రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News