: ట్రంప్ కు దీటుగా సమాధానం చెప్పిన మోదీ ప్రభుత్వం


భారత్‌-పాక్‌ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు ట్రంప్‌ జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హాలే ప్రకటన చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వ దీటుగా సమాధానం చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్-పాక్ చర్చల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, ఏ ఇతర మూడో వ్యక్తి లేదా సంస్థల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం తదితర అంశాల్లో భాగంగా భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాలను తమ రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తద్వారా భారత్ తో స్నేహం పేరుతో అమెరికా, పాకిస్థాన్ కు మద్దతు పేరుతో చైనా వంటి మూడో దేశం ప్రమేయాన్ని భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News