: యూపీ కేబినెట్ నిర్ణయాలివే...రుణమాఫీకి పచ్చజెండా


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నిక‌ల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ వాగ్దానాన్ని నిల‌బెట్టుకున్న‌ామని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన లక్ష రూపాయల వరకు రుణాన్ని తీర్చనున్నామని ప్రకటించారు. రుణమాపీ అమలు వల్ల యూపీలో 2.5 కోట్ల మంది రైతుల‌ు రుణభారం నుంచి విముక్తి పొందుతారని ఆయన చెప్పారు.

ఇక ఈ రుణమాఫీతో రాష్ట్ర ఖజానాకు సుమారు 36 వేల కోట్ల రూపాయల భారం ప‌డ‌నుందని ఆయన చెప్పారు. అంతే కాకుండా యూపీ రైతుల నుంచి గోధుమ‌ పంటను నూరు శాతం కొనాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. అలాగే అక్ర‌మ క‌బేళాల మూసివేత‌, యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు వంటి నిర్ణయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా చేయాలని నిర్ణయించారు. 

  • Loading...

More Telugu News