: పైలట్లు కూడా కాపీ కొట్టి పాసవుతున్నారట!


పైలట్లు పరీక్షల్లో కాపీ కొట్టి పాసవుతున్నారని ఓ సర్వే తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య విమాన పైలట్ల ఇంగ్లిష్ భాష పరిజ్ఞానలేమి వల్ల లండన్ ఎయిర్‌ స్పేస్ పలు సమస్యలను ఎదుర్కొంటోందని ఈ సర్వే వెల్లడించింది. గడిచిన 18 నెలల కాలంలో లండన్ ఎయిర్‌ స్పేస్‌ లో వందల కొద్దీ మిస్ కమ్యూనికేషన్ జరుగుతున్నాయి. దీంతో లండన్ ఎయిర్ స్పేస్ విభాగం ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పైలట్ల పూర్ ఇంగ్లిష్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తేలింది. ఈ మధ్య ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఓ పైలట్ విమానాన్ని మిడ్‌ ల్యాండ్స్ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్ చేయగా, మాంచెస్టర్ ఎయిర్‌ పోర్టులో ల్యాండింగ్ సమయంలో లెఫ్ట్.. రైట్ విషయంలో పైలట్ తికమకపడ్డాడు. దీంతో పెను ప్రమాదం తప్పిందని తేలింది. గత ఏడాది కాలంలో ఇంగ్లిష్ సరిగ్గా రాని కారణంగా అర్థం చేసుకోవడంలో సమస్యల వల్ల సుమారు 267 సమస్యలు ఉత్పన్నమయ్యాయని లండన్ ఏవియేషన్ విభాగం తెలిపింది.

మరి పైలట్లకు ఇంగ్లిష్ సరిగ్గా రానప్పుడు కఠినమైన పరీక్షలు ఎలా పాసయ్యారన్న అనుమానం వచ్చిందా?. పైలట్లు పరీక్షల్లో చీటింగ్ చేయడం, లంచాలు ఇవ్వడం, కాపీ కొట్టడం వంటి మార్గాల్లో ఇంగ్లిష్ పరీక్షల్లో పాసయ్యారని ఈ సర్వేలో తేలింది. అంతే కాకుండా ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) ప్రొఫిషెన్సీ ప్రకారం అంతర్జాతీయ విమాన పైలట్లకు కనీస ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం లేదని తేలింది. పైలట్లు, కంట్రోలర్స్‌ ఇంగ్లిష్ భాష లేమి వల్ల తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన ఇంటర్నేషనల్ ఏవియేషన్ విభాగం...అంతర్జాతీయ పౌర విమానయాన రంగంలో పనిచేసే వారు ఐసీఏఓ నిర్వహించే లెవల్ 4 పరీక్ష పాస్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇతర ఏవియేషన్ రంగాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని లండన్ ఏవియేషన్ తెలిపింది. 

  • Loading...

More Telugu News