: వైఎస్సార్సీపీని పెట్టిన రోజే అసలైన బ్లాక్ డే: మంత్రి కాల్వ శ్రీనివాసులు


వైఎస్సార్సీపీని స్థాపించిన రోజే అసలైన బ్లాక్ డే అని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న జగన్ వ్యాఖ్యలతో విభేదించిన వైఎస్సార్సీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారే తప్ప, తమ పార్టీకి సంఖ్యా బలం లేక వారిని తీసుకోవడం జరగలేదని అన్నారు. గతంలో రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్ సీఎంల దగ్గర మంత్రిగా పని చేసిన విషయాన్ని కాల్వ శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News