: యూపీలో ‘సైకిల్’ కు గుడ్ బై చెప్పిన మహిళా నేత
యూపీలోని సమాజ్ వాదీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, శివపాల్ యాదవ్ మద్దతుదారు శ్వేతాసింగ్ రాజీనామా చేశారు. తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా శ్వేతా సింగ్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా తాను పార్టీకి సేవలందించానని, ఇకపై, తన సేవలు ఎంత మాత్రం అవసరం లేదని, అందుకే, రాజీనామా చేశానని చెప్పారు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలోనూ మళ్లీ ఈ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరిలో సమాజ్ వాదీ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా శ్వేతా సింగ్ నియమితులయ్యారు.