: తక్కువ రేట్లకే మరో డిజిటల్ సర్వీసులు అందించడానికి రిలయన్స్ జియో సిద్ధం!
టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇక డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 360 పైగా చానళ్లను జియో టీవీ ఆఫర్ చేయనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటిలో 50 హెచ్‌డీ ఛానల్స్ ఉంటాయట. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటాప్ బాక్స్ ఇమేజ్ లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. వాటిపై జియో ముద్రలు కూడా ఉన్నాయి. ఈ సెటాప్ బాక్స్ లు దీర్ఘచతురస్రాకారంలో ఫ్రంట్ లో యూఎస్‌బీ పోర్టు, స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న సెటాప్ బాక్స్‌ల కంటే ఈ జియో సేవలు ఎంతో అత్యాధునికమైనవి. వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకోవచ్చట. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానల్ లో వస్తాయో తెలిసిపోతుందట. డీటీహెచ్ విభాగంలోనూ తక్కువ రేట్లకే సేవలు అందిస్తూ జియో మరో సంచలనం సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సర్వీసులను మొదట ముంబయిలో ప్రారంభిస్తారని తెలుస్తోంది.