: 10 లక్షలు ఇస్తామని చెప్పి 5 లక్షలే ఇచ్చారు... మిగిలింది కూడా ఇవ్వండి: టీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మహిళ
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు రూ. 10 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తనకు మాత్రం కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చిందని పావని అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మిగిలిన రూ. 5 లక్షలను కూడా తనకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేసింది. ఉద్యమంలో తన భర్త చనిపోయిన తర్వాత తనకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆమె వాపోయింది. అందరికీ ఇచ్చినట్టే తనకు కూడా పూర్తి మొత్తాన్ని అందజేయాలని శంషాబాద్ జిల్లా శంకర్ పల్లి గ్రామానికి చెందిన పావని కోరింది.