: మధుమేహ బాధితులు ఆలస్యంగా పడుకుంటే ముప్పే!


మధుమేహంతో బాధపడుతున్న వారు నిద్ర విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి పూట ఆల‌స్యంగా నిద్ర‌పోతే డిప్రెష‌న్ ముప్పు వ‌చ్చే ప్ర‌మాదం అధికంగా ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ పరిశోధ‌న‌కు నేతృత్వం వహించిన థాయ్‌లాండ్‌లోని మహిడోల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సిరిమన్ రూట్రకుల్ ప‌లు వివ‌రాలు తెలుపుతూ... సాయంత్రం పూట ఎక్కువ పనిచేస్తూ, రాత్రుళ్లు ఆల‌స్యంగా పడుకుంటూ ఎక్కువసేపు మేలుకుని ఉండే టైప్ 2 మధుమేహం బాధితులకు డిప్రెషన్ త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఆల‌స్యంగా పడుకునే వారికి బాగా నిద్ర‌ప‌ట్టిన‌ప్ప‌టికీ, తొందరగా పడుకుని త్వరగా లేచేవాళ్ల కంటే వాళ్ల‌కు డిప్రెషన్  ముప్పు అధికంగానే ఉంద‌ని చెప్పారు.

సర్కాడియన్ ఫంక్షనింగ్‌కు, డిప్రెషన్‌కు మధ్య సంబంధం గురించి మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న‌వారు తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఈ విష‌యాన్ని తెలుసుకుంటే మధుమేహ రోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందని ఆయ‌న సూచించారు. ఏ స‌మ‌యంలో నిద్ర‌పోతున్నార‌నే విష‌యాన్ని బ‌ట్టే మధుమేహ బాధితుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News