: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక తీరకపోవడంతో... చివరకు ఇలా చేశాడు!
చైనాకు చెందిన ఇంజినీర్ చెంగ్ కు చాలా ఏళ్లుగా ఒక కోరిక ఉంది. అదేంటంటే... ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం. దీంతో, ప్రేమించడం కోసం తన మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఎంతో కాలంగా వెతుకుతున్నాడు. ఎంత వెతికినా, వేచి చూసినా నచ్చిన అమ్మాయి మాత్రం అతనికి తారసపడలేదు. దీంతో, విసిగి వేసారి పోయాడు. చివరకు ఓ రోబోను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.
ఈ క్రమంలో, తన అభిరుచులకు తగ్గట్టు సొంతంగా ఓ రోబోను తయారు చేసుకున్నాడు. దానికి యింగ్ అనే పేరుపెట్టుకున్నాడు. ఆ రోబోను పెళ్లి కుమార్తెలా ముస్తాబు చేసి... తన తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో ఓ చిన్న వేడుకలో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి విషయం ప్రస్తుతం చైనాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, రానున్న రోజుల్లో రోబోలతో మానవ సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు కూడా చెబుతున్నారు.