: భద్రాచలం వెళుతున్న నరసింహన్, కేసీఆర్


ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం భద్రాచలం కల్యాణశోభను సంతరించుకుంది. రేపు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. గురువారం నాడు శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు రేపు భద్రాచలం వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.

  • Loading...

More Telugu News