: అలక వీడని బుచ్చయ్య.. గన్ మెన్లు కూడా వద్దన్న టీడీపీ సీనియర్ నేత!


మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకపాన్పు ఎక్కారు. ఆయనను సముదాయించేందుకు పలువురు నేతలు ప్రయత్నించినప్పటికీ... ఆయన మాత్రం అలకను వీడలేదు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి మంత్రులు యనమల, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరైనప్పటికీ... గోరంట్ల మాత్రం దూరంగా ఉన్నారు. అంతేకాదు, తనకు భద్రతను కల్పిస్తున్న గన్ మెన్లను సైతం ఆయన తిరస్కరించారు. గన్ మెన్లు తనకు వద్దంటూ ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News