: ‘పశ్చిమ’కు చంద్రబాబు పెద్దపీట.. 20 ఏళ్లలో ఇది రెండోసారి!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పశ్చిమ నుంచి ముగ్గురు మంత్రులు ఉండడం 20 ఏళ్లలో ఇది రెండోసారి. 2004కు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లా నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు, కోటగిరి విద్యాధరరావు, దండు శివరామరాజులు మంత్రులుగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే మరోసారి ముగ్గురికి ఆ అవకాశం దక్కింది.
జవహర్, పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావులు ప్రస్తుతం మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు మంత్రివర్గంలో చోటు దక్కడం మరో విశేషం. పీఈటీ అయిన దండు శివరామరాజును మంత్రిని చేయగా ఉపాధ్యాయురాలిగా పనిచేసి రాజీనామా చేసిన పీతల సుజాతకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. తాజాగా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన జవహర్‌కు మంత్రిగా అవకాశం కల్పించారు.