: సీన్ రివర్స్! ప్రేమించాలంటూ వెంటపడిన యువతి.. పోలీసులను ఆశ్రయించిన యువకుడు!


సాధారణంగా ప్రేమించాలంటూ యువతి వెంటపడే యువకుల గురించి వింటుంటాం. అయితే ఇది అందుకు రివర్స్. తనను ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడడంతో ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని భద్రావతికి చెందిన మెకానికల్ ఇంజనీర్ హేమంత్ పై ఇష్టం పెంచుకున్న యువతి అతడిని ప్రేమిస్తోంది. అయితే ఆమె ప్రేమను అతను నిరాకరించాడు. దీంతో సహించలేని యువతి గతేడాది సెప్టెంబరులో హేమంత్ తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హేమంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల్లో యువతి ఆరోపణలు నిరాధారమని తేలడంతో అతడిని వదిలేశారు. కాగా సోమవారం జిమ్ నుంచి వస్తున్న హేమంత్‌ను చూసిన యువతి, ఆమె తల్లి అతడి వెంట పడ్డారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి పట్టుబట్టింది. హేమంత్ బైక్‌ను కిందపడేశారు. రాళ్లతో కొట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకున్న హేమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న హొసమణి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News