: ఆ సిగ్నల్స్ పంపిస్తున్నది గ్రహాంతర వాసులే: స్పష్టం చేసిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
గ్రహాంతర వాసులు ఉన్నారా? అంటే 'ఏలియన్ హంటర్స్' ఉన్నారని, వారిని పట్టుకుంటామని చెబుతుంటారు. శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు చేస్తున్నాం అని చెబుతారు. అయితే గ్రహాంతర వాసులు ఉన్నారని, మన శాస్త్రవేత్తల్లాగే వారు కూడా విశ్వంలోని ఇతర జీవురాశుల ఉనికిని పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మన శాస్త్రవేత్తలు ఎట్టకేలకు అంగీకరించారు. గత 10 ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్య శక్తిమంతమైన సంకేతాలు ఫాస్ట్ రేడియో బరస్ట్ (ఎఫ్‌ఆర్‌బీ) లను పంపుతున్నారని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనడమే లక్ష్యంగా వారు ఈ శక్తిమంతమైన తరంగాలను పంపుతున్నారని వారు తెలిపారు.
అంతే కాకుండా, ఆస్ట్రేలియాలోని మోలోగ్లో రేడియో టెలిస్కోప్ ద్వారా 2013లో మూడు ఎఫ్‌ఆర్బీలను గుర్తించామని, ఆ తరంగాల సమాచారాన్ని విశ్లేషించగా అవి అంతరిక్షానికి అత్యంత దూరం నుంచి, వేరే గెలాక్సీ నుంచి వస్తున్నాయని తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తరంగాలను పంపించేది బహుశా గ్రహాంతరవాసులే కావచ్చునని మెల్ బోర్న్ లోని స్విన్ బర్న్ యూనివర్సిటీ అఫ్ టెక్సాలజీ శాస్త్రవేత్త మాథ్యూ బేయిల్స్ తెలిపారు. అయితే ఇన్నాళ్లూ ఆ తరంగాలను మానవులే పంపిస్తున్నారని భావించామని, అయితే అది తప్పని గుర్తించామని, గ్రహాంతర వాసులు పంపుతున్న శక్తిమంతమైన తరంగాలను కనుగొనడంపాటు విశ్లేషించడం కూడా చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈ సువిశాల విశ్వాంతరాళంలో మనిషి ఒంటరి వాడు కాదని, మనిషితో పాటు మరికొన్ని గ్రహాలపై కూడా జీవం ఉందని వారు పేర్కొంటున్నారు.