: మంత్రులకు శాఖలు కేటాయించిన తీరు అద్భుతం: కేఈ కృష్ణమూర్తి


ఏపీలో మంత్రులకు ఆయా శాఖలు కేటాయించిన తీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కితాబిచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ లో బీసీలకు పెద్దపీట వేశారని, ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం ఇదే తొలిసారని, బీసీ ఓటర్లు ఎటూ పోకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. కాగా, ఏపీ మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఈ రోజు శాఖల కేటాయింపు జరిగింది. అలాగే, ప్రస్తుతం మంత్రులుగా వ్యవహరిస్తున్న వారి శాఖల్లో కూడా మార్పులు జరిగాయి.

  • Loading...

More Telugu News