: ప్లాస్టిక్ ఎగ్ వార్త నిజమా?: మమతా బెనర్జీ
శనివారం కోల్ కతాలో అనితా కుమార్ అనే మహిళ కొన్న గుడ్లలో ప్లాస్టిక్ గుడ్డు వచ్చిందని, ఆమె దానిని ఆమ్లెట్ వేసే ప్రయత్నం చేయగా, అది పెనంకి అంటుకుపోయిందని, దానికి నిప్పు పెట్టగా చాలా సేపు కాలిందని, దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, కలకలం సృష్టించిన ప్లాస్టిక్ ఎగ్ వార్త నిజమా? గాలి వార్తా? అన్నది తెలుసుకోవాలనుందని అన్నారు. అయితే తన రాష్ట్రంలోనే జరిగిన ఘటనపై సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఈ రకమైన వ్యాఖ్య చేయడం ఆసక్తి రేపుతోంది.