: జగన్ ని టార్గెట్ చేసేందుకే మంత్రి వర్గ విస్తరణ చేసినట్టుగా ఉంది: వైఎస్సార్సీపీ నేత పార్థసారథి
ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా.. జగన్ ని టార్గెట్ చేసేందుకే ఏపీ మంత్రి వర్గ విస్తరణ చేసినట్టుగా ఉందని వైఎస్సార్సీపీ నేత పార్థసారథి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమకు మంత్రి పదవి రాలేదంటూ అలక వహించిన టీడీపీ నేతలకు అదే విషయాన్ని చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఏదో రకంగా జగన్ ను దెబ్బతీయాలనే దుష్ప్రచారం కూడా చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా తమ అనుకూల మీడియాతో జగన్ పై దాడి చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు.