: చంద్రబాబూ! ముస్లింలు, గిరిజనులకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు?: సీపీఐ నేత రామకృష్ణ


ముస్లింలు, గిరిజనులకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబును సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన చంద్రబాబు, నూతన అధ్యాయానికి తెర తీశారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టు స్థలంపై ప్రధాని మోదీకి లేఖ రాశానని, లారీల యజమానుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని రామకృష్ణ సూచించారు.

  • Loading...

More Telugu News