: ‘కాంగ్రెస్’ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత ఏకే వాలియా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏకే వాలియా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు టికెట్ కేటాయింపులపై అసంతృప్తి చెందిన వాలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వాలియా మాట్లాడుతూ, డబ్బులకు పార్టీ టికెట్లను కాంగ్రెస్ అమ్ముకుంటోందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. అంతేకాకుండా, పార్టీలో తాను సీనియర్ నేతను అని, తన మాటను ఎవరూ వినడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నాడు ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ ప్రభుత్వంలో వాలియా కీలక బాధ్యతలు చేప్టటారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాలియా రాజీనామా చేయడంపై పార్టీలో చర్చనీయాంశమైంది.