: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పవర్‌బ్యాంక్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోం: రాచకొండ సీపీ


ఎల్లుండి నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ స్టేడియంలో మొద‌టి మ్యాచు జ‌ర‌గ‌నుంది. న‌గ‌రంలో మొత్తం 8 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని రాచకొండ కమిషనరేట్‌ సీపీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. ఇందు కోసం భారీ భద్రత ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. మొత్తం 1800 మంది పోలీసులు, 88 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పిన ఆయ‌న‌... ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక షీ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్టేడియంలోకి పవర్‌బ్యాంక్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోమ‌ని చెప్పారు. స్టేడియం పరిసరాల్లో 9వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించామ‌ని, మధ్యాహ్నం 3.30కు అభిమానుల‌ను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News