: తెలంగాణలో చేస్తే రాజకీయ వ్యభిచారం అన్నారు.. ఇప్పుడు మీరు చేసిందేమిటి?: చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ ఫైర్


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ప‌ట్ల సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేను మంత్రిని చేసిన స‌మ‌యంలో అది రాజకీయ వ్యభిచారం అని విమ‌ర్శించిన ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఇప్పుడు ఆయ‌న‌ చేసేదేంటో చెప్పాలని రామ‌కృష్ణ డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబుకు రాజకీయ నైతిక విలువలు లేవని, ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు ఇవ‌్వడం ఆయ‌న రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఏపీలో మూడు పార్టీల ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మ‌రోవైపు కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు న‌డుపుతున్న స్వర్ణభారతీ ట్రస్ట్‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఆ ట్ర‌స్ట్ లో జ‌రుగుతున్న‌ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందులో వెంకయ్యనాయుడి పాత్రపై నిజానిజాల‌ను తేల్చాల‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News