: 'అవినీతి తిమింగలం' గంగాధరానికి చెందిన లాకర్లను తెరిచిన ఏసీబీ.. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం!


ఆదాయానికి మించి ఆస్తులు ఆర్జించారని స‌మాచారం రావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.గంగాధరం ఇంట్లో సోదాలు జ‌రిపి, ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఈ రోజు ఆయ‌న‌కు సంబంధించిన 8 బ్యాంకు లాకర్లను ఓపెన్‌ చేశారు. వాటిలో విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మ‌రోవైపు వివిధ ప్రదేశాల్లో గంగాధరంకి సంబంధించిన ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ త‌నిఖీలు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌వ్విన కొద్దీ ఆస్తులు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో అధికారులు సైతం విస్మ‌యం చెందుతున్నారు. 

  • Loading...

More Telugu News