: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తులను జప్తు చేసిన ఈడీ
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. అతనికి చెందిన ఫామ్ హౌస్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఆస్తిని అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఫామ్ హౌస్ ఢిల్లీ శివారులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.