: త్రిషను ముద్దు పెట్టుకున్న ఫొటోపై స్పందించిన రానా!
సినీ గాయని సుచిత్ర లీక్ చేసిన ఫొటోలు, వీడియోలు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పలువురు హీరో, హీరోయిన్లు సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫొటోలను ఆమె బయటపెట్టింది. శింబు, ధనుష్, రానా, త్రిష, హన్సిక, నయనతార తదితరుల ఫొటోలు బహిర్గతం చేసింది సుచిత్ర. వీటిలో హీరోయిన్ త్రిషను హీరో రానా ముద్దాడుతున్న ఫొటో కూడా ఉంది. ఈ ఫొటోపై ఓ తాజా ఇంటర్వ్యూలో రానా స్పందించాడు. ఈ వివాదానికి కారణం మీడియానే అని... మీడియా చేసిన హంగామా వల్లే ఈ విషయం చాలా పెద్దదిగా మారిందని అన్నాడు. ఇలాంటి ఫొటోలు చాలానే ఉంటాయని... చెబుతూనే, అయినా తాను అలాంటి పనులు చేస్తానంటే నమ్ముతారా? అంటూ జోక్ చేశాడు రానా.