: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై సర్వత్ర ఆసక్తి... నేడు ఖరారు కానున్న శాఖలు


నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త మంత్రులుగా ప‌లువురు నేత‌లు ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయా మంత్రుల‌కు ఏయే శాఖలు కేటాయిస్తారన్న అంశంపై ఈ రోజు ప్ర‌క‌ట‌న రానుంది. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై ఇప్పటికే ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు పూర్తి చేశారని స‌మాచారం. దీంతో అంద‌రి చూపూ సీఎంవో నుంచి వెలువడే ప్రకటనపైనే ఉంది. మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులకు సిద్ధమవుతున్నారు. నలుగురైదుగురు పాత మంత్రుల శాఖల్లో మార్పు ఉండకపోవచ్చని స‌మాచారం. కొత్త‌గా క్యాబినెట్‌లోకి చేరిన యువ‌నేత నారా లోకేశ్‌కు ఏ శాఖ అప్పగిస్తారనే అంశంపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

  • Loading...

More Telugu News