: ఆ పని చేస్తే చైనాకే మంచిది... లేకపోతే, ఎవరికీ మంచిది కాదు: ట్రంప్


చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్న ఉత్తరకొరియాను చైనా కంట్రోల్ చేయాలని... లేకపోతే, ఆ పనిని తాము చేయాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. వాళ్లంతట వాళ్లు ముందుకు వచ్చి ఉత్తరకొరియాను నియంత్రిస్తే అది చైనాకే మంచిదని... లేకపోతే ఎవరికీ మంచిది కాదని అన్నారు. అసలు ఈ విషయంలో చైనా తమకు సాయం చేయాలనుకుంటోందో, లేదో మొదట స్పష్టం చేయాలని చెప్పారు. చైనా అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోనే ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమాలను పెంచుకుంటూ పోతోందని ట్రంప్ మండిపడ్డారు. త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయనతో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News