: అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖలను సమర్పించిన చింతమనేని


టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ తన ఎమ్మెల్యే పదవితో పాటు అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవికి  రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖలను ఏపీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఇంటికి వెళ్లి మరీ సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో ఆయా పదవులకు రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అయిన చింతమనేని, పార్టీ కోసం ఎంతో కష్టపడినా తనకు మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   

  • Loading...

More Telugu News