: రేపటి నుంచి నన్ను పిలవొద్దు: మీడియా ప్రతినిధులతో బోండా ఉమ


రేపటి నుంచి ఎటువంటి చర్చా కార్యక్రమాలకు, ఇంటర్వ్యూలకు తనను పిలవొద్దని మీడియా ప్రతినిధులతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఈ మేరకు ఉమ తన వాట్సప్ గ్రూప్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. రెండున్నరేళ్లుగా సహకరించిన మీడియా ప్రతినిధులకు తన ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాగా, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ బోండా ఉమకు చంద్రబాబు వివరించి చెప్పడంతో ఆయన మెత్తపడ్డ విషయం తెలిసిందే. చంద్రబాబును కలిసిన అనంతరం టీడీపీ అధినేత చెప్పిన ప్రకారం తాను నడుచుకుంటానని కూడా ఉమ పేర్కొనడం తెలిసిందే.

  • Loading...

More Telugu News