: సీఎం ఆశీస్సులే నన్ను మంత్రిని చేశాయి!: మంత్రి నక్కా ఆనంద్ బాబు
ప్రజల సహకారం, సీఎం ఆశీస్సుల వల్లే తనకు మంత్రి పదవి లభించిందని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్న ఆనంద్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పని చేస్తానని, ఏ శాఖ కేటాయించినప్పటికీ, అందులో పట్టు సాధించడం ముఖ్యమని చెప్పారు. 2019లో టీడీపీని మరోమారు అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.