: బోండా ఉమ తీరుపై చంద్రబాబు అసంతృప్తి!
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం లభించకపోవడంపై ఎమ్మెల్యే బోండా ఉమ అలక వహించడం, ఆ పార్టీ నేతలు ఆయనకు సర్దిచెప్పడం .. ఆపై సీఎం చంద్రబాబుతో ఉమ భేటీ కావడం తెలిసిందే. అయితే, బోండా ఉమ తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి .. మంత్రి పదవి అడగడం భావ్యమా? అని బోండాను చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాధాన్యతను, ఆ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు గుర్తు చేసినట్టు సమాచారం. టీడీపీలో క్రమశిక్షణ ముఖ్యం అనే విషయాన్ని బోండా ఉమకు చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.