: మంత్రి పదవి రాకున్నా హుందాగా వ్యవహరించారంటూ యరపతినేనికి చంద్రబాబు ప్రశంస
గుంటూరు జిల్లాలోని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఏపీ మంత్రి వర్గ విసర్తణలో భాగంగా వెలగపూడిలో ఈరోజు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై చంద్రబాబు, లోకేష్ కు యరపతినేని ఎదురుపడ్డారు. ‘మంత్రి పదవి రాకున్నా చాలా హుందాగా వ్యవహరించావు’ అంటూ యరపతినేనిని చంద్రబాబు ప్రశంసించారు.
ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని యరపతినేనికి బాబు హామీ ఇచ్చారు. లోకేష్ ఆప్యాయంగా యరపతినేనిని ఆలింగనం చేసుకున్నారు. ‘అన్నా, మీరంటే ఎంతో అభిమానం, మంత్రి పదవి రాలేదని బాధపడొద్దు’ అంటూ యరపతినేనికి లోకేష్ ధైర్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన యరపతినేని, తనకు మంత్రి పదవి దక్కలేదనే బాధ లేదని, టీడీపీకి, నారా కుటుంబానికి విధేయుడినని వారితో చెప్పారట.