: బొజ్జలకు బుజ్జగింపు.. మూడు సార్లు ఫోన్ చేసిన చంద్రబాబు!


మంత్రి పదవిని కోల్పోయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు మూడు సార్లు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. విస్తరణకు కారణాలను, బొజ్జలను ఎందుకు తీసేయాల్సి వచ్చిందన్న అంశాలను వివరించి, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. పార్టీ పరిస్థితిని తాను అర్థం చేసుకున్నానని, తన పరిస్థితిని కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా బొజ్జల వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇక ఆయన్ను ఎవరో రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News