: కేసీఆర్ ను ఉచ్చరించలేని తిట్లు తిట్టిన పెద్దమనిషి ఇప్పుడిలా చేస్తాడా?: బాబుపై రఘువీరా నిప్పులు


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ టికెట్ పై పోటీ చేసి, ఆపై టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చిన సమయంలో, కేసీఆర్ ను ఉచ్చరించలేని తిట్లు తిట్టిన పెద్దమనిషి చంద్రబాబు, ఇప్పుడు అదే పని చేసి, రాష్ట్ర పరువును గంగలో కలిపాడని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. ఇప్పుడు జగన్ పార్టీ నుంచి ఫిరాయించిన వారికి పదవులు ఇచ్చి, కేసీఆర్ తో సమానమైన చంద్రబాబు, తన తప్పుడు పనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంత్రివర్గంలో గిరిజనులకు, మైనారిటీలకు స్థానం లేకుండా పోయిందని, మహిళా మంత్రుల సంఖ్య తగ్గిందని అన్నారు. గవర్నర్ గా నరసింహన్ కొనసాగేందుకు అనర్హుడని అన్నారు. ఇకపై తాము రాజ్ భవన్ లో కాలు పెట్టబోమని తెలిపారు.

  • Loading...

More Telugu News