: కేశినేని నాని, కొనకళ్ల నారాయణ బుజ్జగింపులతో సర్దుకున్న బొండా ఉమ!
తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ, కార్యకర్తలతో సమావేశమై, తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధపడ్డ బొండా ఉమ వెనక్కు తగ్గారు. ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు ఉమ ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించడంతో సర్దుకున్నట్టు తెలుస్తోంది. బొండా ఉమ సేవలను మరింతగా వినియోగించుకుంటామని, సామాజిక సమీకరణాలు కుదరని కారణంగానే ఆయన్ను తీసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పిన వివరణను ఉమకు చేరవేసి, ఆయన రాజీనామా చేయకుండా చూడటంలో విజయం సాధించారు. ఆపై ఉమను వెంటబెట్టుకుని సీఎం ఇంటికి ముగ్గురు నేతలూ వెళ్లారు. ఉమ మాత్రం, తాను సీఎంతో మాట్లాడిన తరువాత తన నిర్ణయాన్ని చెబుతానని వ్యాఖ్యానించడం గమనార్హం.