: చంద్రబాబుకు ఇక కౌంట్ డౌన్ స్టార్టయింది!: రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి అధికారానికి కౌంట్ డౌన్ మొదలై పోయిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతిలో మాట్లాడిన ఆయన, తాను అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన తరువాత కూడా మైనారిటీ వర్గం నుంచి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో సమతుల్యత లోపించిందని, వైకాపా నుంచి వచ్చిన వారిలో నలుగురికి పదవులు ఇచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గుతోందని అర్థం చేసుకున్న ఆయన, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.