: కాపులు, రెడ్లకు పెద్దపీట... చంద్రబాబు మంత్రివర్గంలో కుల సమీకరణాలు!


సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గం వివక్షకు గురవుతుందన్న అభిప్రాయాలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తాజా విస్తరణతో క్యాబినెట్ లో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు చేరినట్లయింది. ఇక, టీడీపీకి ఎంతో ముఖ్యమైన ఓటుబ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల్లో ఉండగా,  ఎస్సీ మాల వర్గం నుంచి ఇద్దరు, ఎస్సీ మాదిగ వర్గం నుంచి ఒకరు మంత్రులుగా ఉన్నారు. వెలమ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ఉన్నారు. జనాభాలో అత్యధిక భాగమున్న బీసీ వర్గాల నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. మొత్తం మీద జిల్లాల వారీగా సమీక్షించిన చంద్రబాబు, ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం అధికంగా ఉందో పరిశీలించి, ఆయా కులాలకు చెందిన వారినే ఎంపిక చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

  • Loading...

More Telugu News